: బంగ్లాదేశ్‌ మీదుగా భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాక


చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ త్వరలో భారత్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో గోవాలో నిర్వహించతలపెట్టిన బ్రిక్స్ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల సదస్సులో ఆయన పాల్గొంటారు. మొదట జిన్‌పింగ్ చైనా నుంచి కాంబోడియా చేరుకుంటారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్‌ మీదుగా ఇండియాకు ప్ర‌యాణించ‌నున్న‌ట్లు చైనా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. త‌న భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గోవాలోనే భారత ప్ర‌ధాని నరేంద్రమోదీతో పాటు ఇతర నాయకులతో ఆయ‌న భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News