: గోదావరిలో పడవ బోల్తా.. 60మంది కూలీలకు తప్పిన పెను ప్రమాదం
సుమారు 60 మంది వ్యవసాయ కూలీలతో వెళులోన్న ఓ పడవ బోల్తా పడిన ప్రమాద ఘటన ఖమ్మం జిల్లా చర్ల మండలం కొత్తపల్లి వద్ద గోదావరిలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. కొత్తపల్లి నుంచి కూరగడ్డల లంకకు వెళుతోండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే, పడవ ఒడ్డుకు చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఒక పడవలోకి నీరు రావడంతో కూలీలు మరో పడవలోకి ఎక్కే ప్రయత్నం చేశారు. పడవలోకి వారు ఒక్కసారిగా వచ్చే ప్రయత్నం చేయడంతో పడవ బోల్తాపడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఆ ప్రాంతంలో సహాయక చర్యలు నిర్వహించారు. గోదావరి ఉద్ధృతి అధికంగా ఉందని అప్రమత్తంగా ఉండాలని పడవ ప్రయాణికులకు అధికారులు సూచిస్తున్నారు.