: ఆ గుళ్లో పెళ్లి చేసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి చేసేశారు!


చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటూ కష్టాలను ఎదుర్కుంటున్న వారి సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు. దానికి తోడు నిండా పెళ్లీడు కూడా రాకుండానే ప్రేమ‌పెళ్లిళ్లు చేసుకునే వారు కూడా అధికంగా క‌నిపిస్తున్నారు. గుడిలోకి వ‌చ్చి మాకు పెళ్లి చేసేయండి అంటూ పూజారుల‌ను వేడుకుంటున్నారు. దీంతో ఆ ఆలయ పూజారులు ఓ ఉపాయం ఆలోచించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నింటికీ ఆధార్‌ను జ‌త చేయాల‌ని ప్ర‌భుత్వం కోరుతున్న‌ట్లే, పెళ్లి చేయాలంటే ఆధార్ తీసుకురావాల‌ని ఆ ఆల‌య‌ పూజారులు అడుగుతున్నారు. అల్మోరా లోని చితై గోలు దేవత ఆలయంలో పూజారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ఆలయంలో మంచి ముహూర్తాలు ఉన్న‌ప్పుడు ప్రతిరోజూ నాలుగైదు జంట‌లు పెళ్లిళ్లు చేసుకుంటాయి. సంవ‌త్స‌రంలో ఈ ఆల‌యంలో దాదాపు 400 వరకు పెళ్లిళ్లు అవుతాయి. వాటిల్లో అధికంగా ప్రేమవివాహాలు జ‌రుగుతున్నాయి. పెళ్లీడు రాకుండానే ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఈ తంతు జ‌రిపించాల‌ని అక్క‌డికి వ‌స్తున్నారు. వారి వయసు విష‌యాన్ని ఆరా తీయ‌డం క‌ష్ట‌మైన పనే కాబ‌ట్టి, అంతేగాక‌ వాళ్ల పేర్లు, చిరునామాలు సరిచూడటం సాధ్యం కాదు క‌నుకే ఈ ప‌నిచేస్తున్న‌ట్లు పూజారులు తెలిపారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే జంట‌లు కూడా ఇక్కడ అధికంగా పెళ్లిళ్లు చేసుకుంటార‌ట‌. నేపాల్‌కు చెందిన చిన్న వయసు పిల్లలను తీసుకొచ్చి ప‌లువురు పెళ్లిళ్లు చేసుకుంటున్నార‌ట‌. అందుకే పూజారులు ‘ఆధార్’ లింకు పెట్టారు.

  • Loading...

More Telugu News