: పేరు షాగీ, వయసు 23... కాల్ సెంటర్ స్కామ్ 'బిగ్ ఫిష్' వివరాలు!


ముంబైలో సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారిని పోలీసులు కనిపెట్టేశారు. 23 సంవత్సరాల వయసున్న షాగర్ థాకర్ అలియాస్ షాగీ ఈ కుంభకోణం వెనకున్న అసలు వ్యక్తని గుర్తించి, అతన్ని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు. షాగీ, అతని సహాయకుడు తపస్ లు మొత్తం కుంభకోణాన్ని నడిపించారని, ఇండియాలో ఉంటూ, కాల్ సెంటర్ ద్వారా అమెరికన్లను బెదిరించి, బుట్టలో వేసుకుని వందల కోట్లు మోసం చేశారని తెలిపారు. "అతి తక్కువ వయసులోనే థాకర్ ఎంతో సంపాదించాడు. చిన్న వయసులో పకడ్బందీగా మోసం చేసే మార్గాన్ని కనుగొని అక్రమంగా సంపాదించాడు" అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అతని వద్ద ఎన్నో హైఎండ్ మోడల్ కార్లున్నాయని పోలీసులు గుర్తించారు. సాధ్యమైనంత త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News