: ఆంధ్రప్రదేశ్‌కు వర్షసూచన
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ఈరోజు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా వాయవ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు.