: నా చిట్టితండ్రి ఎంత పెద్దవాడయ్యాడో!: సినీ హీరో ధనుష్


‘నా చిట్టితండ్రి అప్పుడే ఎంత పెద్దవాడైపోయాడో’ అంటూ తమిళ సినీనటుడు ధనుష్ తన కుమారుడి గురించి ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నాడు. ధనుష్‌, ఐశ్వర్యల కుమారుడు యాత్రా ఈరోజు 10వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న కుమారుడి గురించి ఈ విధంగా పోస్ట్ చేశాడు. తన కొడుకు, బ‌ర్త్ డే బోయ్ ‘యాత్రా’తో కలిసి ఇంట్లో పూజ నిర్వహించిన సందర్భంగా తీసిన ఓ ఫొటోను ఆయ‌న అభిమానుల‌తో పంచుకున్నాడు. త‌న కుమారుడి మనసు బొమ్మల నుంచి గాడ్జెట్లపైకి మళ్లిందని, త‌న కొడుకు అప్పుడే పెద్దవాడైపోయాడ‌ని ధ‌నుష్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News