: మహారథంపై దేవదేవుడు, ముగింపుదశకు బ్రహ్మోత్సవాలు


తిరుమల శ్రీవెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నేడు ఎనిమిదో రోజున మహారథంపై మలయప్పస్వామి మాఢవీధుల్లో ఊరేగుతూ, తనను కొలిచే భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. గరుడోత్సవం తరువాత అంత ప్రసిద్ధి చెందిన మహా రథోత్సవం సందర్భంగా తిరుమల భక్తజనంతో కిక్కిరిసిపోయింది. ఇక నేటి రాత్రి అశ్వవాహనం, ఆపై రేపు పల్లకీ ఉత్సవం, చక్రస్నానం, ధ్వజావరోహణంతో ఈ ఏటి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల 8వ రోజు నాటికి 20 లక్షల మందికి పైగా తిరుమలకు వచ్చినట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు. గరుడోత్సవం నాడు 4 లక్షల మందికి పైగా తిరుమలకు వచ్చారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలుగకుండా అన్ని చర్యలూ తీసుకోవడంలో విజయవంతమైనట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News