: సర్జికల్ దాడులతో ఉడికిపోతున్న పాక్.. ప్రతీకారం తీర్చుకునే యత్నాలు.. త్వరలో భారీ ఉగ్రదాడి?


భారత సైన్యం సర్జికల్ దాడులతో ఉడికిపోతున్న పాక్ ప్రతీకార దాడుల కోసం రంగం సిద్ధం చేస్తోంది. భారీ ఉగ్రదాడికి పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు నిఘావర్గాలకు సమాచారం అందింది. దీంతో దాడులను తిప్పికొట్టేందుకు భారత సైన్యం కూడా సిద్ధమైంది. సర్జికల్ దాడులను జీర్ణించుకోలేకపోతున్న పాక్ త్వరలోనే భారత్‌లో ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉగ్రవాదుల ముప్పు నేపథ్యంలో దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. చారిత్రక తాజ్‌మహల్‌కు భద్రత పెంచారు. ఏకంగా 36 మంది కమాండోలను అక్కడ మోహరించారు. దసరా నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందన్న సమాచారంతో పెద్ద నగరాల్లో భద్రతను పెంచారు.

  • Loading...

More Telugu News