: బోరబండలో భూ ప్రకంపనలు..భయాందోళనలతో పరుగులు తీసిన ప్రజలు
హైదరాబాద్ లోని బోరబండలో ఈరోజు రాత్రి భూ ప్రకంపనలు సంభవించాయి. బోరబండలోని గాయత్రీనగర్, పద్మావతి నగర్ లో 3 సెకన్లపాటు భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, నిజంగా భూ ప్రకంపనలు సంభవించాయా? లేక ఏదైనా పేలుడుకు సంబంధించిన ప్రకంపనలా? అనే విషయమై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రాంతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.