: జయలలితను పరామర్శించిన వెంకయ్యనాయుడు
తమిళనాడు సీఎం జయలలితను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పరామర్శించారు. కొన్ని రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఈరోజు రాత్రి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నానని అన్నారు. కాగా, జయలలితపై వస్తున్న వదంతులు సరికాదని వెంకయ్యనాయుడు సూచించారు.