: తెలంగాణలోని బీసీ విద్యార్థులకు శుభవార్త.. కొత్త పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణలోని బీసీ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. మహాత్మాజ్యోతిరావ్ పూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పేరిట రూపొందించిన ఈ పథకం ద్వారా బీసీ విద్యార్థులకు రూ.20 లక్షల (గరిష్టంగా) వరకు ఆర్థిక సాయం చేయనుంది. తొలి ఏడాది 300 మంది బీసీ విద్యార్థులకు రూ.60 కోట్ల మేరకు సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.