: ఇండోర్ టెస్టు: భారత్ తొలి ఇన్నింగ్స్ 557/5 డిక్లేర్డ్
న్యూజిలాండ్ తో ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో రెండో రోజూ ఆట ముగిసింది. రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా 160 ఓవర్లు ఆడి భారీ స్కోర్ చేసింది. 5 వికెట్లు కోల్పోయి 557 పరుగులు చేసింది. కాగా, ఈ రోజు ఆట మరో 9 ఓవర్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేస్తున్నట్లు కెప్టెన్ కోహ్లీ ప్రకటించాడు. కోహ్లీ 211, రహానె 188, రోహిత్ శర్మ 51, జడేజా 17, పుజారా 41, గంభీర్ 29, మురళీ విజయ్ 10 పరుగులు చేశారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ విషయానికి వస్తే, వికెట్లేమీ నష్టపోకుండా 9 ఓవర్లలో 28 పరుగులు చేసింది.