: దాసరి లాంటి వ్యక్తులు విమర్శలు చేయడం బాధాకరం: రామానుజయ
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు లాంటి వ్యక్తులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా బాధాకరమని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే విమర్శలు చేస్తున్నారని, కాపుల మధ్య చిచ్చు పెట్టాలని వైఎస్సార్సీపీ యత్నిస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ఈ నెల 19, 20 తేదీల్లో విజయవాడలో కాపు నిరుద్యోగులకు శిక్షణ, 21న కాపు జాబ్ మేళా వున్నాయని, సుమారు 100 కంపెనీలు హాజరవుతాయని రామానుజయ తెలిపారు.