: మాయావతి ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట..ఇద్దరు మృతి


బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరగడంతో ఇద్దరు మృతి చెందగా, కొందరు గాయపడ్డారు. వచ్చే ఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో బీఎస్పీ ప్రచార సభలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో లక్నోలో పార్టీ అధినేత్రి మాయావతి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు దాదాపు లక్ష మందికి పైగా మద్దతుదారులు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం, బయటకు వెళ్లేందుకు అందరూ ఒక్కసారిగా యత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇద్దరు మృతి చెందగా, 28 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News