: అరుదైన సచిన్-లక్ష్మణ్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ - రహానే


బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్ లో నాలుగో వికెట్ భాగస్వామ్యానికి సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లు నెలకొల్పిన భాగస్వామ్య రికార్డును కోహ్లీ - రహానేల జోడీ బద్దలు కొట్టింది. జట్టు స్కోరు 453 పరుగులకు చేరగానే ఈ రికార్డు బద్దలైంది. 2004 సంవత్సరంలో జనవరి 2 నుంచి 6 మధ్య జరిగిన మ్యాచ్ లో భారత తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల పతనం తరువాత ఫోర్త్ డౌన్ గా వచ్చిన సచిన్ 241, ఆపై ఫిఫ్త్ డౌన్ గా వచ్చిన లక్ష్మణ్ 178 పరుగులు చేసి 353 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 705 పరుగులు చేసింది. మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుతం ఇండోర్ లో జరుగుతున్న మ్యాచ్ లో నాలుగో వికెట్ భాగస్వామ్యానికి కోహ్లీ, రహానేలు ఆ రికార్డును బద్దలు కొట్టారు. కోహ్లీ 206, రహానే 161 పరుగులకు చేరగానే, వీరిద్దరి భాగస్వామ్యం 353 పరుగులను దాటింది. దీంతో మైదానంలో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ప్రస్తుతం భారత స్కోరు 145.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 454 పరుగులు.

  • Loading...

More Telugu News