: రజనీకాంత్ అందగాడు కాదన్న బాలీవుడ్ క్రిటిక్... మండిపడుతున్న అభిమానులు
అందంగా ఉన్నంత మాత్రాన సినీ రంగంలో సూపర్ స్టార్లు కాలేరని చెబుతూ, రజనీకాంత్ ప్రస్తావన తెచ్చిన వివాదాస్పద బాలీవుడ్ సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ పై రజనీ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. సూపర్ హీరో కావడానికి మంచి బాడీ, లుక్స్ అర్హతలుగా భావిస్తే, రజనీ సూపర్ స్టార్ అయ్యేవారా? అని ప్రశ్నించిన ఖాన్, అవే అర్హతలైతే, ప్రతి జిమ్ కోచ్, బాడీగార్డులు కూడా స్టార్ లైపోతారని చెప్పాడు. చూడటానికి రజనీ చాలా చండాలంగా ఉంటాడని వ్యాఖ్యానించాడు. కమాల్ కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, రజనీ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.