: స్వచ్ఛ భారత్ కోసం.. కేటీఆర్ కు రూ. 31.20 కోట్ల చెక్కిచ్చిన వెంకయ్యనాయుడు
తెలంగాణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత విస్తృతి చేసేందుకు రూ. 31.20 కోట్ల నిధిని కేంద్రం ప్రకటించగా, అందుకు సంబంధించిన చెక్కును మునిసిపల్ మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా అందించారు. ఈ ఉదయం హైటెక్స్ లో జరిగిన 'స్వచ్ఛ గృహ' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఓ రాజకీయ కార్యక్రమంగా చూడకుండా, ప్రజల నుంచి వచ్చిన ఉద్యమంలా చూడాల్సిన పరిస్థితి రావడం శుభపరిణామమని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందే ఉత్తి చేతులతో వెళ్లరాదని చెప్పి, వివిధ శాఖలకు పురమాయించి ఈ చెక్కును సిద్ధం చేయించానని తెలిపారు. స్వచ్ఛ భారత్ కు మరింత ప్రచారం కల్పించే దిశగా లఘు చిత్రాలను ఆహ్వానిస్తే, 4500 షార్ట్ ఫిలింస్ వచ్చాయని, వీటిల్లో టాప్ గా నిలిచిన వాటికి బహుమతులు ఇస్తున్నట్టు తెలిపారు.