: జయలలితకు లిక్విడ్ ఫుడ్ ఇస్తున్నాం: అపోలో వైద్యులు
ఊపిరితిత్తుల సమస్యతో గత 18 రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మరిన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని వైద్యులు స్పష్టం చేశారు. ఆమెకు ప్రస్తుతం పోషకాలతో కూడిన ద్రవాహారం ఇస్తున్నామని, ఫిజియో థెరపీ కొనసాగుతోందని తెలిపారు. ఆమె ఊపిరితిత్తులు కుంచించుకుపోగా, వాటిని సరిచేసే చికిత్సను అందిస్తున్నామని వెల్లడించారు. అమ్మకు దీర్ఘకాలిక చికిత్స అవసరమని తేల్చి చెప్పారు. కాగా, జయలలితను వెన్నంటి ఆమె స్నేహితురాలు శశికళ సహాయకురాలిగా ఆసుపత్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే.