: 'ట్రంప్ ఓ పంది, కుక్క' అంటూ విరుచుకుపడ్డ హాలీవుడ్ హీరో రాబర్ట్ డినీరో
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ పై వ్యతిరేకత క్షణక్షణానికీ పెరుగుతోంది. ఆయన్ను వ్యతిరేకిస్తున్న వారిలో తాజాగా, హాలీవుడ్ సీనియర్ నటుడు రాబర్ట్ డినీరో కూడా చేరారు. ట్రంప్ ను పంది, కుక్కలతో పోల్చిన ఆయన, ట్రంప్ దేశానికే చేటని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలను 'ఫాక్స్' న్యూస్ ప్రసారం చేసింది. 'గెట్ అవుట్ ది ఓట్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అతనో మూర్ఖుడని, ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని వ్యక్తని, ఎవరినీ లెక్క చేయడని అన్నారు.