: తన పుస్తకాన్ని తనకే అమ్మజూపిన వేళ... శిల్పా శెట్టికి ఎదురైన వింత అనుభవం!
ఓ పుస్తకం రాసిన వ్యక్తికే, దాన్ని అమ్మబోతే... బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి, 40 పదుల వయసులోనూ వన్నె తగ్గని మెరుపుతో అభిమానుల మతి పోగొడుతున్న శిల్పా శెట్టికి ఇదే అనుభవం ఎదురైంది. రైటర్ ల్యూక్ కౌటినో తో కలసి, ఆరోగ్యం మీద ప్రజల్లో శ్రద్ధ పెరిగేలా శిల్పా శెట్టి రాసిన 'ది గ్రేట్ ఇండియన్ డైట్' పుస్తకం అమ్మకాలు జోరుగా సాగుతున్న వేళ, ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద శిల్పా కారు ఆగితే, ఓ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వచ్చి అద్దాన్ని తట్టాడు. అద్దాన్ని కిందకు దించగానే తాను రాసిన పుస్తకం చూపుతూ, దీన్ని కొనుగోలు చేస్తారా? అని అడిగాడట. ఆపై కారులో ఉన్న శిల్పాను గుర్తించి, తాను చేసిన పొరపాటును తెలుసుకున్నాడట. అతన్ని, అతని చేతిలోని తన పుస్తకాన్ని చూసి శిల్పా కూడా పెద్దగా నవ్వేసిందట. ఇక రాసినోళ్లకే పుస్తకాన్ని అమ్మడమంటే, కామెడీయేకదా?