: కావేరీ నీరు రానివేళ... తమిళనాడుకు కృష్ణ నీరివ్వాలని చంద్రబాబు నిర్ణయం


కర్ణాటక నుంచి కావేరీ నీరు రానివేళ, కనీసం తాగు నీరు లేక విలవిల్లాడుతున్న తమిళనాడుకు మూడు టీఎంసీల నీరిచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. తమిళనాడులో పరిస్థితిని వివరిస్తూ, ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్ రావు తనకు ఫోన్ చేశారని చెప్పిన చంద్రబాబు, నీరిచ్చేందుకు అంగీకరించినట్టు తెలిపారు. విజయవాడలో జరిగిన సీఐఐ (కాన్ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కృష్ణ నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా నీటిని విడుదల చేయనున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఈ సమావేశానికి వచ్చిన సీఐఐ తమిళనాడు ప్రతినిధులు నీటి విడుదల నిర్ణయంపై చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News