: వరంగల్ కు బయలుదేరిన కేసీఆర్ దంపతులు... అమ్మవారి మొక్కు తీర్చుకోనున్న సీఎం
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో, తన కోరిక నెరవేరితే, వరంగల్ భద్రకాళి అమ్మవారికి కిరీటం, హస్త, పాద ముద్రలను బంగారంతో చేయిస్తానని మొక్కుకున్న కేసీఆర్, నేడు ఆ మొక్కు తీర్చుకోనున్నారు. ఇప్పటికే ఆభరణాలు సిద్ధం కాగా, వాటిని తీసుకుని కేసీఆర్ దంపతులు వరంగల్ బయలుదేరారు. మొత్తం 11.7 కిలోల బంగారంతో అమ్మవారికి ఆభరణాలు తయారు చేయించిన సంగతి తెలిసిందే. సీఎం రాక నేపథ్యంలో పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల వరకూ సాధారణ భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించడం లేదని తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.