: ఒక్కటి కూడా కొనం... చైనా వస్తువులపై నిషేధం విధించిన బీహార్ గ్రామం
ఇండియాలో ఉగ్రదాడులు చేస్తున్న పాకిస్థాన్ కు బహిరంగ మద్దతిస్తున్న చైనాను దెబ్బకొట్టాలని బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఓబ్రా గ్రామ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాలో తయారైన అన్ని రకాల ప్రొడక్టులను తమ గ్రామంలో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసినా, విక్రయించినా జరిమానా విధించాలని తీర్మానించామని ఓబ్రా సర్పంచ్ గుడియా దేవి వెల్లడించారు. చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలన్న ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.