: కోయంబత్తూరులో మరో ముగ్గురు ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్టు


దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా పేలుళ్లు జరగవచ్చునన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు, సానుభూతిపరుల కోసం వేట కొనసాగిస్తోంది. గత ఆదివారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అరెస్టు చేసిన ఆరుగురు ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల విచారణ సందర్భంగా వెలుగు చూస్తున్న కొత్త అంశాల నేపథ్యంలో తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ, న్యూఢిల్లీ, కేరళ నిఘావర్గాల సహకారంతో ఐసిస్‌ కార్యకలాపాలపై దృష్టిపెట్టిన ఎన్‌ఐఏ అధికారులు, కోయంబత్తూరులో ఆ సంస్థ రహస్య కదలికలను గుట్టు రట్టు చేశారు. వీరిని మరింత లోతుగా విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News