: మా ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తున్నా: బాలీవుడ్ నటి కాజోల్


ఉరీలో ఉగ్రవాదుల దాడులు జరిగిన తర్వాత బాలీవుడ్ నిట్టనిలువునా చీలిపోయింది. బాలీవుడ్ నుంచి పాకిస్థాన్ కళాకారులను నిషేధించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తుండగా... కళాకారులను కళాకారులుగానే చూడాలని, ఉగ్రవాదంతో వారిని ముడిపెట్టరాదని మరో వర్గం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో, పాక్ నటులపై బాలీవుడ్ నిర్మాతల మండలి నిషేధం విధించింది. నిర్మాతల మండలి నిర్ణయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సమర్థించాడు. రెండు దేశాల మధ్య కాల్పులు జరుగుతున్నంత కాలం రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు కూడా ఉండరాదని స్పష్టం చేశాడు. తన సినిమాలు పాకిస్థాన్ లో విడుదల కాకపోయినా సరే తాను పట్టించుకోనని చెప్పాడు. కళాకారులందరూ సొంత దేశానికి మద్దతుగా ఉండాలని తెలిపాడు. అజయ్ దేవగణ్ వ్యాఖ్యలపై ఆయన భార్య, సినీ నటి కాజోల్ స్పందించింది. తన భర్త నిర్ణయం సరైనదని, రాజకీయాలకు అతీతంగా తీసుకున్న నిర్ణయమని ట్వీట్ చేసింది. అజయ్ నిర్ణయానికి గర్విస్తున్నానని చెప్పింది.

  • Loading...

More Telugu News