: పాకిస్థాన్ ఐఎస్ఐ చీఫ్ మార్పు?
పాకిస్థాన్ లో అత్యంత శక్తిమంతమైన గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్ ను మారుస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అఖ్తర్ ప్రస్తుతం ఐఎస్ఐ అధినేతగా వ్యవహరిస్తున్నారు. ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ గా సెప్టెంబర్ 2014లో రిజ్వాన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి ఐఎస్ఐ చీఫ్ పదవీకాలం మూడేళ్లు. రిటైర్మెంట్ అయితేనో లేదా ఆర్మీ చీఫ్ అతడిని తొలగిస్తేనో తప్ప ఆ పదవిని ఇతరులకు అప్పగించరు. కానీ, ఊహించని విధంగా రిజ్వాన్ తన పదవీకాలం ఇంకా ఉండగానే తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. కరాచీ పోలీస్ కమాండర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముఖ్తార్ ఐఎస్ఐ కొత్త చీఫ్ గా నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.