: మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన రిలయన్స్ జియో.. ఐ ఫోన్ యూజర్లకు 15 నెలల పాటు ఇక అన్నీ ఫ్రీ
4 జీ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఇప్పటికే ఎన్నో ఆఫర్లు ప్రకటించిన రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్‌ను కస్టమర్ల ముందుంచింది. ఫ్రీ డేటా అండ్ రోమింగ్ అంటూ వినియోగదారులను ఎంతగానో ఆకర్షించి, ఇతర టెలికం కంపెనీల ఆగ్రహానికి గురైన జియో.. ఈ సారి ఐ ఫోన్ యూజర్లకు 15నెలల పాటు ఉచిత సర్వీసులు అందించనున్నట్లు పేర్కొంది. ఆపిల్ ఫోన్ ను ఉపయోగించే వారందరికీ జియో ద్వారా సంవత్సరం పాటు ఉచిత సేవలను అందిస్తున్నట్లు చెప్పింది. నెలకు రూ.1,499 రీచార్జ్ తో లభించే సర్వీపును ఇప్పుడు పూర్తి ఉచితంగా సంవత్సరం పాటు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వెల్ కం అనే ఆఫర్ కూడా ఉంది. తాజా ఆఫర్‌తో కలిపి మొత్తం 15 నెలల పాటు ఉచిత సర్వీసులు అంందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవచ్చు. జియో వెల్ కం ఆఫర్ ఈ ఏడాది డిసెంబర్ 31న ముగిసిన అనంతరం, అన్ని ఆపిల్ కొత్త ఆవిష్కరణలు ఐ ఫోన్ 7 , ఐ ఫోన్ 7 ప్లస్ తో పాటు, ఐఫోన్ 6, 6 ప్లస్, 6S ప్లస్, ఎస్ఈ ఇతర ఐ ఫోన్ల వినియోగదారులకి కూడా ఈ ఆఫర్ అందనుంది. జియో దెబ్బతో మిగతా టెలికాం కంపెనీలన్నీ విలవిలలాడుతున్నాయి. విపరీతమయిన పోటీ ఉండడంతో మిగతా కంపెనీలు కూడా పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.