: మరోసారి కాల్పులు జరిపిన పాకిస్థాన్.. తిప్పికొట్టిన సైన్యం


పాకిస్థాన్‌కి గట్టిగా బుద్ధి చెబుతూ భారత సైన్యం పీవోకేలోకి ప్ర‌వేశించి ల‌క్షిత దాడులు చేసినప్పటికీ, పాక్ మాత్రం క‌వ్వింపు చ‌ర్య‌ల‌ను మానుకోవ‌డం లేదు. స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ త‌రువాత కూడా త‌రుచుగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. ఈరోజు జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లోని మెంధార్ నియంత్రణ రేఖ దగ్గర పాక్ సైన్యం కాల్పులు జ‌రిపింది. వీటిని భార‌త సైన్యం తిప్పికొట్టింది. అయితే, ఒక భార‌త‌ సైనికుడికి గాయాలయ్యాయి. పూంచ్ సెక్టార్‌లో మూడు రోజుల నుంచి పాక్‌సైన్యం ఇటువంటి చ‌ర్య‌ల‌కు దిగుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో ప‌దిరోజుల్లో మొత్తం 26 సార్లు పాక్ ఆర్మీ కాల్పుల విర‌మ‌ణ‌ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

  • Loading...

More Telugu News