: సికింద్రాబాద్‌లో 68 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి చనిపోయిన బాలిక
సికింద్రాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. కఠోర ఉపవాస దీక్ష చేసిన 13 ఏళ్ల ఓ బాలిక ప్రాణాలు విడిచింది. జైన మత సంప్రదాయం ప్రకారం ఆరాధన అనే బాలిక 68 రోజులు ఉపవాసం చేసింది. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతిచెందింది. ఉపవాస దీక్షలో నీరు కూడా తీసుకోలేదు. ఉపవాక్ష దీక్ష చేస్తే ఆ ఇంటికి మంచి జరుగుతోందనే నమ్మకంతో బాలికతో ఆ ఇంట్లోని వారు దీక్ష చేయించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ బాలిక 21 రోజుల పాటు ఉపవాసం చేసి విరమించినట్లు తెలుస్తోంది.