: హైదరాబాద్‌లో ఓలా క్యాబ్ డ్రైవర్‌ను దోచుకున్న దుండగులు.. నగదు, కారుతో పరారీ


హైదరాబాదులో ఓలా క్యాబ్ డ్రైవర్ దోపిడీకి గురయ్యాడు. క్యాబ్‌ను బుక్ చేసుకున్న దుండగులు సురారం వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ను బెదిరించి అతడి వద్ద ఉన్న సొత్తును కాజేశారు. వనస్థలిపురంలో దుండగులు క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. క్యాబ్ సురారం సమీపంలోకి చేరుకోగానే డ్రైవర్‌ను బెదిరించిన ఆగంతుకులు అతడి నుంచి నగదు, సెల్ ఫోన్, కారు లాక్కుని పరారయ్యారు. బొంగులూరు గేటు దగ్గర దుండగులు వెళ్తున్న కారును ఆదిభట్ల పోలీసులు గుర్తించారు. అయితే కారు ప్రమాదానికి గురి కావడంతో దుండగులు దానిని వదిలి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News