: మొన్న ఇందిర.. నిన్న రాజీవ్.. నేడు రాహుల్.. హుటాహుటిన చెన్నై వచ్చి పరామర్శ
తండ్రి వారసత్వాన్ని కొడుకుగా రాహుల్ గాంధీ అనుసరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఆగమేఘాలపై వచ్చిన సంగతి తెలిసిందే. సరిగ్గా 33 ఏళ్ల క్రితం 1983లో ఇదే నెలలో, అదే అస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ను పరామర్శించేందుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసరంగా చెన్నై వచ్చారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 1988లో రోడ్డు ప్రమాదంలో గాయపడి దేవకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రాజీవ్ గాంధీ కూడా ఆగమేఘాలపై వచ్చి ఆమెను పరామర్శించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వారిలాగే నిన్న అకస్మాత్తుగా చెన్నై చేరుకుని జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.