: సరస్వతి దేవిగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ.. సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
విజయవాడ కనక దుర్గమ్మ నేడు భక్తులకు సరస్వతి దేవిగా దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా నేటి సాయంత్రం నాలుగు గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునుంచే భక్తులు క్యూకట్టారు. దీంతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ రోజు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.300, రూ.500 క్యూ లైన్లలో సాధారణ భక్తులను అనుమతిస్తున్నట్టు ఈవో సూర్యకుమారి తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.