: రైలు ప్రయాణాల్లో చోరీకి, ప్రమాదానికి గురైన ఎలక్ట్రానిక్ వస్తువులకు ఇకపై బీమా?
రైలు ప్రయాణీకులకు శుభవార్త. రైల్లో ప్రయాణించే సమయంలో చోరీకి గురైన, లేక ప్రమాదానికి గురైన ఎలక్ట్రానిక్ వస్తువులకు కూడా ఇకపై బీమా లభించనుంది. ల్యాప్ టాప్, మొబైల్స్ కు కూడా బీమా సౌకర్యం కల్పించే యోచనలో ఉన్నట్లు ఐఆర్సీటీసీ డైరెక్టర్ ఎకె మనోచా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల ఐఆర్ సీటీసీ ప్రయాణికులకు ప్రవేశపెట్టిన బీమా పథకానికి అనూహ్య స్పందన రావడంతోనే తాము ఈ విషయమై ఆలోచించామని, పలు బీమా కంపెనీలతో చర్చిస్తున్నామని చెప్పారు. మొదటిదశ కింద క్రెడిట్ కార్డుదారులకు, ప్రభుత్వ అధికారులకు ఈ సౌకర్యాన్ని అందించాలని కొందరు సూచించారని చెప్పారు.