: ‘కాపు’ కంచాల్లో ముద్రగడ నీళ్లు పోస్తున్నారు.. దాసరి వంటివారు కాపులకు కీడు చేస్తున్నారు!: రామానుజయ


కాపు కులస్తుల కంచాల్లో ముద్రగడ పద్మనాభం నీళ్లు పోస్తున్నారంటూ ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ఆరోపించారు. చిత్తూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ తో కలిసి ముద్రగడ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాపు నేతలుగా చెప్పుకుంటున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, దాసరి నారాయణరావు వంటి వారు కాపులకు మేలు చేయడానికి బదులు కీడు చేస్తున్నారని విమర్శించారు. కాపు సంక్షేమం కోసం ప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఆయన సూచించారు. బీసీలకు ఎలాంటి నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని రామానుజయ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News