: సైన్యాన్ని అభినందించాలి.. మోదీని కాదు!: హోర్డింగుల వివాదంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి


బీఎస్సీ అధినేత్రి మాయావతి భారత సైన్యం ఇటీవల చేసిన లక్షిత దాడుల‌పై స్పందించారు. నియంత్రణ రేఖను దాటి పీవోకేలోకి ప్రవేశించి ఉగ్రవాదులను హతమార్చినందుకు అభినందించాల్సింది భారత జవాన్లను కానీ, ప్రధాని నరేంద్రమోదీనో, ర‌క్ష‌ణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్‌నో కాద‌ని ఆమె అన్నారు. స‌ర్జిక‌ల్ స్ట్రయిక్స్‌పై ఉత్తరప్రదేశ్‌లో మోదీ, పారిక‌ర్‌ల‌ను పొగుడుతూ పోస్టర్లు వెలిసిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇటువంటి పోస్ట‌ర్లు పెట్ట‌డం ప‌ట్ల వివాదం చెల‌రేగుతోంది. ఈ వివాదంపై మాయావతి మాట్లాడుత‌ూ... అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ల‌క్షిత దాడుల‌ను వినియోగించుకుంటూ బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ఆరోపించారు. రాజకీయ ప్ర‌యోజ‌నాల కోసం వాటిని ఉపయోగించుకోవడమేంట‌ని ప్ర‌శ్నించారు. హోర్డింగులు, పోస్టర్లు, ప్రకటనల ద్వారా బీజేపీ ఓట్లు సంపాదించ‌డానికి యత్నిస్తోందని విమ‌ర్శించారు. ఇటువంటి ప్రచారాలను ఆపేయాల‌ని ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News