: నా పిల్లలను ఇప్పుడే పబ్లిక్ కు చూపించాలనుకోవడం లేదు: అభిమానికి ఆస్కార్ విజేత సమాధానం


ఆస్కార్ అవార్డు విజేత హాలె బెర్రీ ఓ అభిమానికి గట్టిగా సమాధానం చెప్పింది. ఇన్ స్టా గ్రాంలో హాలె బెర్రీ తన ఇద్దరు పిల్లలు నహ్లా ఆబ్రే, మకేవో మార్జింజ్ ల ఫోటోలు పోస్టు చేసింది. ఈ ఫోటోల్లో ఈ ఇద్దరి ముఖాలు పూర్తిగా రాకుండా ఎడిట్ చేసి పోస్టు చేసింది. దీనిపై ఓ అభిమాని మండిపడ్డాడు. వారిద్దరూ చాలా అందంగా ఉంటారని, వారిని ప్రపంచానికి చూపించకుండా ఎందుకు దాచేస్తున్నావని ఆమెను నిలదీశాడు. దీంతో తన పిల్లలు తన ఇష్టమని ఘాటుగా సమాధానం ఇచ్చిన హాలె బెర్రీ... తన పిల్లలు తన సంరక్షణలో వాళ్లు సృజనాత్మకత కలిగిన వారుగా తయారవుతున్నారని తెలిపింది. వారిని ఇప్పుడే ప్రపంచానికి చూపించాలని తాను భావించడం లేదని ఆమె స్పష్టం చేసింది. తన పిల్లల గురించి చెప్పేందుకు తాను సిగ్గుపడడం లేదని తెలిపింది. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు చెప్పానని గుర్తుచేసింది.

  • Loading...

More Telugu News