: కేసీఆర్ కు కొత్త జిల్లాలపై 'హైపవర్' నివేదికను అందజేసిన కేకే
తెలంగాణలోని కొత్త జిల్లాల అంశంపై రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అధ్యక్షుడిగా హైపర్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. హైదరాబాదులోని కేకే నివాసంలో ఈరోజు హైపవర్ కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ముసాయిదాలో పేర్కొనని కొత్త జిల్లాలయిన గద్వాల్, సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్ అంశాలపై ప్రజల నుంచి వచ్చిన వినతులు, అభ్యంతరాలను చర్చించారు. కొద్దిసేపటి క్రితం కేకేతో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. కేబినెట్ భేటీలో ఉన్న కేసీఆర్ కు వారు తమ నివేదికకు అందించారు. ఈరోజు సాయంత్రం కేసీఆర్ కొత్త జిల్లాలపై మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.