: రాహుల్ గాంధీకి సరైన ఎడ్యుకేషన్ లేదు: సుబ్రహ్మణ్య స్వామి
పీవోకేలో భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రాణాలు పణంగా పెట్టి భారత సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించిందని... కానీ, జవాన్ల త్యాగాలను మోదీ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఉపయోగించుకుంటున్నారని ఆయన అన్నారు. దీంతో రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు. ఆయనకు సరైన ఎడ్యుకేషన్ లేదని పేర్కొన్నారు. మోదీపై మతిలేని వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ తన మానసిక పరిస్థితిపై పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.