: ఢిల్లీ ఉపముఖ్యమంత్రికి ఏసీబీ సమన్లు.. ఈ నెల 14న సిసోడియాను ప్రశ్నించనున్న అధికారులు
ఢిల్లీ మహిళా కమిషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల నియామకం జరిగిందన్న ఆరోపణలపై ఆ కమిషన్ మాజీ చీఫ్ మర్కా సింగ్ శుక్లా ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్‌పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తమ ముందు హాజరుకావాలని అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) సమన్లు జారీ చేసింది. ఈనెల 14న ఆయన ఏసీబీ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు. విచారణలో ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్‌ను ఇప్పటికే ఏసీబీ అధికారులు రెండుసార్లు ప్రశ్నించారు.