: పోర్బందర్లోని నేవీ ప్రధాన కేంద్రంలో భారీ పేలుడు.. అధికారుల అప్రమత్తం
గుజరాత్ పోర్బందర్లోని నేవీ ప్రధాన కేంద్రంలో ఈరోజు భారీ పేలుడు సంభవించింది. భారీగా పేలుడు, కాల్పుల శబ్దాలు వినిపించినట్లు అధికారులు తెలిపారు. పేలుడు ఘటనాస్థలికి పోర్బందర్ ఎస్పీ, ఐజీ బయలుదేరారు. పాకిస్థాన్, భారత్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ భారీ పేలుడు శబ్దాలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు అప్రమత్తమై ఏం జరిగిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.