: బీసీసీఐ అధ్యక్షుడిపై నిప్పులు చెరిగిన లలిత్ మోదీ


లలిత్ మోదీ... ఐపీఎల్ ను ప్రారంభించి, క్రికెట్ కు కమర్షియల్ గ్లామర్ అద్దిన మేధావి. ఆ తర్వాత ఐపీఎల్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయనే నేరారోపణలతో దేశాన్ని విడిచి పారిపోయాడు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పై లలిత్ మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ లో ఫిక్సర్ ఎవరైనా ఉన్నారంటే అది అనురాగ్ ఠాకూరే అని లలిత్ మోదీ అన్నాడు. బీసీసీఐలో అనురాగ్ రియల్ ఫిక్సర్ అయితే... ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఓ మోసగాడు అని మండిపడ్డాడు. అనురాగ్ ఠాకూర్ కు సంబంధించిన క్రికెటింగ్ పత్రాలు కూడా నకిలీవే అంటూ ధ్వజమెత్తాడు. లోథా కమిటీ సిఫారసులకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయంతో ఇప్పటికే బీసీసీఐ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. తాజాగా, ఠాకూర్ పై లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలు బీసీసీఐని మరింత ఇరకాటంలోకి నెట్టేవే.

  • Loading...

More Telugu News