: సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రాజ్‌నాథ్ సింగ్‌ భేటీ ప్రారంభం


భార‌త స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులపై చ‌ర్చించడానికి రాజ‌స్థాన్‌లోని జై సల్మేర్ లో కేంద్ర‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్వ‌హించ‌త‌లపెట్టిన భేటీ ప్రారంభ‌మైంది. రాజ‌స్థాన్ చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్‌కు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌ర రాజే స్వాగ‌తం ప‌లికారు. స‌మావేశంలో వారితో పాటు జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపాని, పంజాబ్ ఉప‌ ముఖ్య‌మంత్రి సుఖ్బీర్ సింగ్ బాద‌ల్ పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది. స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై వారు రాజ్‌నాథ్‌సింగ్ కు వివ‌రిస్తున్నారు. ఈ స‌మావేశంలో సరిహద్దు భద్రతా దళాల (బీఎస్ఎఫ్‌) ఉన్న‌తాధికారులు కూడా పాల్గొంటున్నారు. స‌రిహ‌ద్దుల్లో భ‌ద్ర‌త‌, ప్ర‌స్తుత ప‌రిస్థితిపై రాజ్‌నాథ్ సూచ‌న‌లు చేస్తున్నారు. రాజ‌స్థాన్‌లో రాజ్‌నాథ్‌ రెండు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు.

  • Loading...

More Telugu News