: నేను పిచ్చి కుక్కను కాదు... నీలా వాగడానికి!!: వీహెచ్ ని ఉద్దేశించి పోసాని వ్యాఖ్యల పూర్తి పాఠం!
ఈ రోజు టీవీ 5 చానల్ లో సర్జికల్ స్ట్రయిక్స్ పై జరిగిన చర్చ పక్కదారి పట్టిన వేళ పోసాని కృష్ణ మురళి, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మధ్య తీవ్ర వాగ్వాదం తిట్ల దండకం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సహనం కోల్పోయిన పోసాని, "నేను మీ చానల్ కు వచ్చినప్పుడు... వినండి... కుక్కల్లా కొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. మనం మనుషులము. నేను మాట్లాడతాను. మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడేటప్పుడు నేను నోర్మూసుకుంటా. నా పాలసీ ఇదే గురువుగారు. నేను పిచ్చికుక్కను కాదు. వాగితే వాగటానికి కుక్కల్లాగా. నాకంటూ ఓ పాలసీ వుంది. నేను చదువుకుని వచ్చాను ఇక్కడికి. నాకు మోదీ ఇష్టం. నేను ఆవేశపడతాను. నేను పొగుడుతాను. నువ్వెవరు అడగటానికి..." అంటూ ఆవేశంగా మాట్లాడుతున్న వేళ, వీహెచ్ కల్పించుకున్నారు. తెలంగాణ యాసలో "అరే నువ్వెవడివిరే... ఎక్కువ మాట్లాడుతున్నవ్. పోయి బయట చెప్పుకో... రేయ్..." అంటూ కుర్చీలోంచి లేచారు. దీంతో పోసాని సైతం తన కుర్చీ నుంచి లేచి రాయలేని బూతులు తిడుతూ వీహెచ్ పైకి దుమికారు. మధ్యలో ఉన్న సీపీఐ నారాయణ వీరిని వారించడానికి ప్రయత్నించినా ఆయన వల్ల కాలేదు.