: ‘బయటి వ్యక్తులు వస్తున్నారు.. రక్షణగోడ నిర్మించాలి’.. కర్నూలులో కళాశాల విద్యార్థినుల ఆందోళన
కర్నూలు రైల్వేస్టేషన్‌కు సమీపంలోని కేవీఆర్ కళాశాల ఎదుట విద్యార్థినులు ఈరోజు ఆందోళనకు దిగారు. రోడ్డు పనుల్లో భాగంగా తమ కళాశాలకు చుట్టూ ఉన్న గోడను మున్సిపల్ సిబ్బంది కొన్ని రోజుల క్రితం కూల్చివేశారని చెబుతున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు గోడ నిర్మించకపోవడంతో బయటి వ్యక్తులు కళాశాల ప్రాంగణంలోకి వస్తున్నారంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణ లేకుండా పోతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రక్షణగోడను నిర్మించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.