: లాన్‌గేట్ ఎదురు కాల్పుల ఘటనపై నేటి నుంచి ఎన్ఐఏ విచారణ
హంద్వారాలోని లాన్‌గేట్ 30 రాష్ట్రీయ రైఫిల్స్ శిబిరంపై నిన్న పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులను భారత సైన్యం విజయవంతంగా తిప్పికొట్టి ముగ్గురిని హతమార్చి వారి వద్ద నుంచి మందుగుండు సామగ్రి, మూడు ఏకే 47 గన్‌లు, పలు మందులు, ఇంజెక్షన్లు, మ్యాపులు స్వాధీనం చేసుకుంది. అయితే, అందులోని మందులు, ఇంజెక్షన్లపై ‘మేడ్ ఇన్ పాకిస్థాన్’ అని రాసి స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) ఈరోజు నుంచి విచారణ ప్రారంభించనుంది. ఆ బృందంలో 10 నుంచి 12 మంది సభ్యులు పాల్గొంటారు. అన్ని ఆధారాలను క్షేత్రస్థాయిలో సేకరించి, పరిశీలన జరిపిన తరువాత నివేదిక తయారు చేసి, కేంద్రానికి అందిస్తారు.