: ట్రంప్ గెలిస్తే దేశం వదిలి వెళ్లిపోతానన్న రాక్ స్టార్


అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సెలబ్రిటీల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇంతకు ముందు పులిట్జర్ అవార్డు గ్రహీత, రచయిత, చరిత్రకారుడు అయిన సాల్ ఫ్రీడ్ లాండర్... ట్రంప్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ను ఏకంగా పిచ్చోడని సంబోధించారు. ఇప్పుడు రాక్ స్టార్ లార్స్ ఉల్రిచ్ కూడా ఈ జాబితాలో చేరాడు. అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ గెలిస్తే... తాను అమెరికా వదిలి వెళ్లిపోతానని తెలిపాడు. ఉల్రిచ్ డెన్మార్క్ దేశస్తుడు. టీనేజ్ లో ఉన్నప్పుడు అమెరికాకు వలస వెళ్లాడు. ఇప్పటికీ డేనిష్ పౌరసత్వం కూడా ఉంది. అమెరికాలో ఉంటూ అమెరికాలో పన్నులు కడుతున్నప్పటికీ, ఇక్కడ ఓటు మాత్రం వేయలేనని ఉల్రిచ్ చెప్పాడు. ట్రంప్ గెలిస్తే వెంటనే విమానాశ్రయం చేరుకుని, అక్కడ నుంచి తన సొంత దేశానికి వెళ్లిపోతానని తెలిపాడు. తాను వంద శాతం డేనిష్ పౌరుడినేనని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News