: ఆ దొంగలను పట్టిస్తే రూ. 33 లక్షల బహుమతి!: పోర్న్ హబ్ బంపరాఫర్


ఈ వారం ప్రారంభంలో పారిస్ లో దోపిడీకి గురైన రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ ఉదంతంలో, దుండగుల గురించిన సమాచారం తెలిపితే 50 వేల డాలర్లు (సుమారు రూ. 33 లక్షలు) బహుమతిగా ఇస్తామని పోర్న్ హబ్ బంపరాఫర్ ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పోర్న్ హబ్ వైస్ ప్రెసిడెంట్ కోరే ప్రైస్, ఆమె తమ కుటుంబంలో ఓ సభ్యురాలని భావిస్తున్నామని అన్నారు. కిమ్ ను కట్టేసి దోచుకెళ్లిన వారిని పట్టుకుని, ఆమెకు న్యాయం జరిగేలా చూడాలన్నదే తమ ప్రయత్నమని వివరించారు. ఈ దోపిడీకి సంబంధించి దుండగులను గుర్తించేందుకు పోర్న్ హబ్ అభిమానులు శ్రమించాలని కోరారు. కాగా, ఆదివారం నాడు కిమ్ ఉన్న గదిలోకి చొరబడిన దుండగులు, ఆమెను బెదిరించి రూ. 45 కోట్ల విలువైన నగలు, నగదు, సెల్ ఫోన్లను అపహరించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News