: పాకిస్థాన్ లో అత్యవసర పరిస్థితుల్లో సైతం విమానాలు దించొద్దు: ఇండియన్ ఎయిర్ లైన్స్


భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఇండియన్ ఎయిర్ లైన్స్ తన పైలట్లకు పలు సూచనలు చేసింది. పాకిస్థాన్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరంగా విమానాలు దించే పరిస్థితి రాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. పాక్ పై భారత సైనికులు సర్జికల్ దాడులు చేసిన తర్వాత... పాకిస్థాన్ తన గగనతలానికి సంబంధించి ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో, విమానంలో మంటలు వ్యాపించడం లాంటి తీవ్ర పరిస్థితుల్లో మినహా... పాక్ భూభాగంలో ఎమర్జెన్సీ ల్యాండ్ కావొద్దని ఎయిర్ ఇండియా తన పైలట్లకు తెలిపింది. అయితే ఈ సూచనలను మౌఖికంగా మాత్రమే చేసింది. అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలు పాక్ మీదుగానే ప్రయాణిస్తుంటాయి. దీనికి సంబంధించి ఇండియన్ ఎయిర్ లైన్స్ సీనియర్ పైలట్ ఒకరు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ లో విమానాన్ని దింపితే... అదే మనకు చివరి గమ్యస్థానం కావొచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో కాందహార్ హైజాకింగ్ జరిగినప్పుడు, 9/11, 26/11 దాడులు జరిగినప్పుడు కూడా ఇలాంటి జాగ్రత్తలే తీసుకున్నారు.

  • Loading...

More Telugu News