: మీ 'ఇగో' మీ తోనే పోదు.. పార్టీకి కూడా అంటుకుంటుంది: చంద్రబాబు


‘మీ ఇగో మీతోనే పోదు.. పార్టీకి కూడా అంటుకుంటుంది. మనల్ని మనమే ఇరుకున పెట్టుకునేలా వ్యవహరించవద్దు’ అని సీఎం చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. టీడీపీ నాయకత్వ సాధికారత వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ,‘ప్రభుత్వంపై పట్టు సాధించాం..పరుగులు తీయిస్తున్నాం. నియోజకవర్గాలపై మీ పట్టు సడలనివ్వకండి. ఎమ్మెల్యేల పనితీరుపై మూడు నెలలకొకసారి ఇచ్చే నివేదికను చూసుకుని లోపాలను సవరించుకోవాలి. మన ఎమ్మెల్యేలందరూ వచ్చే ఎన్నికల్లో గెలవాలనేదే నా తపన. ఆర్థికంగా దెబ్బతిన్న కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాము’ అని చంద్రబాబు అన్నారు. కాగా, నామిటేడ్ పదవులు భర్తీ చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబుకు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News