: ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో చండీగఢ్ లో హై అలర్ట్ !
భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ లలో హైఅలర్ట్ ప్రకటించారు. తాజాగా, ఆ జాబితాలో కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ కూడా చేరింది. చండీగఢ్ లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారుల హెచ్చరికల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని చండీగఢ్ హోం శాఖ కార్యదర్శి అనురాగ్ అగర్వాల్ ధ్రువీకరించారు. పోలీసులను అప్రమత్తం చేశామని, అనుమానాస్పదంగా కనపడిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించామని పేర్కొన్నారు.